close
Choose your channels

అనుష్క సినిమాలో హాలీవుడ్ హీరో

Saturday, January 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనుష్క సినిమాలో హాలీవుడ్ హీరో

హీరోయిన్‌గా చాలా గ్యాప్‌ తీసుకున్న అనుష్క తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు కోన వెంకట్ పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ మైఖేల్ మాడ్సన్ విలన్‌గా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ సినిమాలో అనుష్క లుక్ అద్భుతంగా ఉంటుందని, ఆమె కెరీర్‌లోనే ఇది బెస్ట్ లుక్ అవుతుందని కోన వెంకట్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్నారు. థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాకి ‘సైలెన్స్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క దివ్యాంగురాలి పాత్రలో కనిపిస్తుంది. గోపీ మోహన్, కోన వెంకట్ కథను అందిస్తున్నారు.

మార్చిలో ప్రారంభం కానున్న ఈ సినిమాని 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరుగుతుందని తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.