close
Choose your channels

బిగ్‌బాస్ 3 పారితోషకం నాకింకా అందలేదు: నటి ఆవేదన

Thursday, October 1, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 3 పారితోషకం నాకింకా అందలేదు: నటి ఆవేదన

‘బిగ్‌బాస్ షో అంటేనే బుల్లితెరపై ఓ సెన్సేషన్. ప్రేక్షకులు విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ షోలో పాల్గొన్న ఓ నటికి ఇప్పటి వరకూ పారితోషికం అందలేదట. దీనిపై తాజాగా ఆమె ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అది తెలుగు బిగ్‌బాస్ కాదులెండి. తమిళ బిగ్‌బాస్ సీజన్ 3. ఈ సీజన్‌లో నటి కస్తూరి కూడా ఒక కంటెస్టెంట్. ఈ సీజన్ పూర్తయి ఏడాది గడుస్తోంది. అయినా కూడా ఇప్పటి వరకూ ఆమెకు రావల్సిన పారితోషికం అందలేదట.

అనాథపిల్లలకు ఆర్థికసాయం అందించడానికే తాను బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొన్నానని కస్తూరి తెలిపారు. అయితే షో నిర్వాహకులు తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇంకా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తానెప్పుడూ ప్రామిస్‌లను నమ్మనని.. అయితే బిగ్‌బాస్ నిర్వాహకులు కూడా తప్పుడు ప్రామిస్‌లు చేస్తారని ఊహించ లేకపోయానని కస్తూరి పేర్కొన్నారు. కాగా.. అక్టోబర్‌ నాలుగు నుంచి తమిళంలో బిగ్‌బాస్‌ సీజన్ 4 ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కస్తూరి ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరి దీనిపై బిగ్‌బాస్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.