close
Choose your channels

నవంబర్ 11న 'ఇంట్లో దెయ్యం..నాకేం భయం'

Tuesday, November 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం'. ఈ చిత్రం ఆడియోను సోమవారం సాయంత్రం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ఆల్లరి నరేష్‌, డైరెక్టర్‌ జి.నాగేశ్వరరెడ్డి, నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌ 11న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నారు.
అల్లరి నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్‌, ధన్‌రాజ్‌, ప్రగతి, రజిత, అమిత్‌, టార్జాన్‌, జయవాణి, అపూర్వ, ఆజాద్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: డైమండ్‌ రత్నబాబు, పాటలు: భాస్కరభట్ల, డాన్స్‌: రాజుసుందరం, గణేష్‌, దినేష్‌, ఫైట్స్‌: సుంకర రామ్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.