'ఇండియన్ 2' ఆగిపోవడానికి కారణమదేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ దర్శకుడు శంకర్ అంటే భారీ తనం, హై టెక్నికల్ వేల్యూస్ ఉన్న చిత్రాలే గుర్తుకు వస్తాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన `2.0` గత ఏడాది నవంబర్‌లో విడుదలైంది. ఇప్పుడు కమల్‌హాసన్‌తో 22 ఏళ్ల క్రితం చేసిన `ఇండియన్` సీక్వెల్‌గా `ఇండియన్ 2`ను తెరకెక్కిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్లో చిత్రీకరణ ప్రారంభమైంది. అయితే కొన్ని రోజులకు సినిమా ఆగింది. ఇలా సినిమా ఆగిపోవడానికి చాలా కారణాలు వినిపిస్తూ వచ్చాయి.
లైకా ప్రొడక్షన్స్‌కు, డైరెక్టర్ శంకర్ మధ్య వచ్చిన బడ్జెట్ సమస్యలతో సినిమాను తాత్కాలికంగా ఆపారంటూ వార్తలు వినిపించాయి. అయితే లెటెస్ట్‌గా కోలీవుడ్‌లో `ఇండియన్ 2` ఆగిపోవడానికి బడ్జెట్ కారణం కాదని.. కమల్‌కు వేస్తున్న మేకప్ అని వార్తలు వినపడుతున్నాయి. కమల్ ముసలి గెటప్‌లో కనిపించడానికి వేసే మేకప్ కారణంగా కమల్‌హాసన్‌కు అలర్జీ వస్తుందట. ఈ కారణంగా ఇప్పటికే రెండు సార్లు బ్రేక్ పడిందని టాక్. కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేస్తారంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.