close
Choose your channels

నిఖిల్ సినిమా మ‌ళ్లీ వాయిదా?

Friday, March 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నిఖిల్ సినిమా మ‌ళ్లీ వాయిదా?

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రూపొందుతున్న చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్‌, ఆరా సినిమా ప్రై.లి. ప‌తాకాల‌పై టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల‌, కావ్య వేణుగోపాల్ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను మార్చి 29న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ లెటెస్ట్ స‌మ‌చారం ప్ర‌కారం సినిమా మ‌ళ్లీ వాయిదా ప‌డుతుంది.

ఇప్పటికే రెండు, మూడు ద‌ఫాలు వాయిదా ప‌డ్డ ఈ చిత్రాన్ని ఎన్నిక‌ల స‌మ‌యంలో విడుద‌ల చేస్తే క‌లెక్ష‌న్స్‌పై ఎఫెక్ట్ ప‌డుతుందేమోన‌ని భావించిన యూనిట్ వ‌ర్గాలు వాయిదా వేయాల‌నుకుంటున్నార‌ట‌. సినిమా త‌దుప‌రి విడుద‌ల తేదిపై ఓ నిర్ణ‌యం తీసుకున్నాక ప్ర‌క‌టించాల‌నుకుంటున్నార‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.