close
Choose your channels

చిన్న బ్రేక్ అంతే.. మ‌ళ్లీ వ‌స్తా: రామ్‌

Saturday, February 6, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ సంక్రాంతికి రెడ్ చిత్రంతో సంద‌డి చేసిన ఎనర్జిటిక్‌ స్టార్‌ హీరో రామ్‌.. నెక్ట్స్‌ మూవీ ఎంటనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఆయన ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరు మరికొన్ని రోజులు ఆగక తప్పేలా లేదు. ఎందుకంటే ఇప్పుడు హీరో రామ్ శివుని దీక్ష తీసుకున్నారు. శివుని మాల వేసుకున్న హీరో రామ్ ఆ విష‌యాన్ని ఫొటో ద్వారా త‌న ఇన్‌స్టా, ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి తెలియ‌జేశారు. చిన్న బ్రేక్ తీసుకుంటున్నాన‌ని, త్వ‌ర‌లోనే వ‌స్తాన‌ని అన్నారు. ఈ దీక్ష న‌ల‌బై రోజుల పాటు ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీని త‌ర్వాతే రామ్ త‌న త‌దుప‌రి సినిమాపై ఫోక‌స్ పెట్టేలా ఉంది.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు రామ్‌ తదుపరి ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్నాడట.త‌మిళ డైరెక్టర్‌ నేసన్‌ రీసెంట్‌గా రామ్‌కు చెప్పిన పాయింట్‌ నచ్చిందట. పూర్తి కథను సిద్ధం చేయమని అన్నాడట. ఎప్పటి నుండో తెలుగుతో పాటు పరభాషలోనూ ఎంట్రీ ఇవ్వాలనుకున్న రామ్‌కు నేసన్‌ చెప్పిన స్క్రిప్ట్‌ అయితే ఇద్దరికీ నచ్చుతుంది కాబట్టి రెండు భాషల్లో సినిమా చేద్దామనుకుని ఓకే అన్నాడంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. త్రివిక్రమ్ తోనూ రామ్ సినిమా చేస్తాడు కానీ.. దానికి ఇంకా సమయం పడుతుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రామ్ తెలియజేశాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.