close
Choose your channels

తాప్సీ స‌హా బాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై ఐటీ దాడులు

Wednesday, March 3, 2021 • తెలుగు Comments

తాప్సీ స‌హా బాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై ఐటీ దాడులు

బాలీవుడ్ సెల‌బ్రిటీస్ అయిన హీరోయిన్ తాప్సీ, ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత‌లు అనురాగ్ క‌శ్య‌ప్‌, వికాస్ భ‌ల్‌పై ఐటీశాఖ వారు దాడులు చేశారు. ముంబైలో వీరి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారుల సోదాలు కొన‌సాగుతున్నాయి. ప‌న్ను ఎగ‌వేత ఆరోప‌ణ‌ల‌తో ఐటీ శాఖ వీరి ఆస్థుల‌ను సోదా చేస్తున్న‌ట్లు స‌మాచారం. దాదాపు 22 ప్రాంతాల్లో ఈ దాడులు జ‌రుగుతున్నాయి. వికాస్‌భ‌ల్‌కి చెందిన ఫాంట‌మ్ ఫిలింస్ కార్యాల‌యంలోనూ ఈ దాడులు కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం. వీరితో పాటు రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీఈఓ శిభాషిస్ స‌ర్కార్‌, ఎక్సైడ్ సీఈఓ అప్స‌ర్ జైదీ, క్వాన్ సీఈఓ విజ‌య్‌సుబ్ర‌హ్మ‌ణ్యంల‌కు సంబంధించిన ఆస్థుల‌పై కూడా ఐటీ సోదాలు జ‌రుగుతున్నాయి. ఈ దాడులు బాలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ద‌క్షిణాదిన సినీ హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన తాప్సీ ప‌న్ను ఓ బేబీ..నామ్ ష‌బానా చిత్రాల నుంచి బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. ఇటు ద‌క్షిణాది, అటు ఉత్త‌రాదిన ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంది తాప్సీ. అలాగే అనురాగ్ క‌శ్య‌ప్ హిందీ సినిమాల‌తో పాటు తమిళ చిత్రాల్లో న‌టిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz