close
Choose your channels

హీరోల్లారా.. జగన్‌రెడ్డికి మీరూ ఒక్క మాట చెప్పండి!

Tuesday, June 9, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోలు, ప్రముఖ దర్శకులు, నిర్మాతలు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిరు, నాగార్జున, దగ్గుబాటి సురేష్, దిల్ రాజుతో పాటు పలువురు ప్రముఖులు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లిలోని గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్‌కి వెళ్లి మధ్యాహ్నం మూడు గంటలకు జగన్‌తో భేటీ కానున్నారు. భేటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా, టీవి సీరియల్స్ నిర్మాణంతో పాటు పలు విషయాలపై నిశితంగా చర్చించనున్నారు. అయితే ఈ భేటీపై జేఏసీ మహిళా నేత, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ తీవ్ర విమర్శలు గుప్పించారు.

నిరూపించుకోండి..!

తెలుగు సినిమా కథానాయకులంతా వారి అవసరాల కోసం మాత్రమే అమరావతికి వస్తున్నారని విమర్శలు గుప్పించారు. మీ అవసరాల కోసం జగన్‌ను కలవడానికి వస్తున్నారు సంతోషమే కానీ.. అమరావతే రాజధానిగా కొనసాగాలని లాగే రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతుల గురించి కూడా ఒక్క మాట చెప్పండని హీరోలకు సూచించారు. అంతేకాదు.. అమరావతే రాజధాని ఉండాలని 175 రోజులుగా ఆందోళన చేస్తున్నారన్న విషయాన్ని కూడా జగన్‌కు గుర్తు చేయాలని సలహా ఇచ్చారు. ఇలా జగన్ రెడ్డికి చెప్పి.. మీరు రీల్ లైఫ్ హీరోస్ మాత్రమే కాదు.. రియల్ లైఫ్ హీరోస్ అని రుజువు చేసుకోండని సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు.

రాజధాని సమస్య మీకు పట్టదా..!?

‘అమరావతి రాజధాని ఒక్క రైతులదే కాదు మన అందరిది. అమరావతి రాజధాని మీ (హీరోల) బాధ్యత కాదా?. సినిమాలు తీసుకోవటానికి.. స్టూడియోలు ఏర్పాటు చేసుకోవటానికి మాత్రం ఏపీలో భూములు కావాలి కానీ రాజధాని సమస్య మీకు పట్టదా?. మీకు సినిమాలకు కలక్షన్స్ ఇస్తూ మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రజలు, అభిమానులు, రైతులు, మహిళలు పడుతున్న బాధలకు మీరు స్పందించరా?. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని, రియల్ హీరోస్ అనుకునే యువతకు ఏమి సందేశమిస్తారు?. 5 కోట్ల ప్రజల కలల రాజధాని అమరావతి. 29000 మంది రైతులు, 34000 ఎకరాలు భూములు త్యాగం చేసి 175 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల అనాలోచిత నిర్ణయం వల్ల ఏపీ భవిష్యత్ ప్రశ్నర్ధకంగా మారింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుని.. అమరావతినే రాజధానిగా కొనసాగించమని జగన్‌కి చెప్పండి. ఏపీ అభివృద్ది.. మా బిడ్డల భవిష్యత్తు కోసం మనకు అన్నం పెట్టే రైతన్నను సినీ పెద్దలు ఆదుకోవాలి’ అని సుంకర పద్మశ్రీ సూచించారు. మరి ఈమె వ్యాఖ్యలపై తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోలు లేదా జగన్‌తో భేటీ కాబోయే సినీ హీరోలు, దర్శకనిర్మాతలు.. మరీ ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు రియాక్ట్ అవుతారేమో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.