సైరాలో ఝాన్సీ పాత్రలో ..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి` నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తొలి స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ నిర్మిస్తోన్న హిస్టారికల్ మూవీ ఇది. ఈ చిత్రంలో అమితాబ్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, కిచ్చా సుదీప్, అనుష్క, నయనతార, తమన్నా భారీ తారాగణం నటిస్తున్నారు.
అనుష్క పాత్ర విషయానికి వస్తే.. పదిహేను నుండి ఇరవై నిమిషాల సేపు పాత్ర కనపడుతుందట. ఆమె పాత్ర పేరు ఝాన్సీ అని వార్తలు వినపడుతున్నాయి. ఝాన్సీ అంటే ఝాన్సీలక్ష్మీబాయ్ కూడా కావొచ్చు. అనుష్క పాత్రను వైవిధ్యంగానే తెరకెక్కించారట. ప్యాచ్ వర్క్ మినహా చిత్రీకరణంతా పూర్తయ్యిందట. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.