close
Choose your channels

విజయ్ దేవరకొండకి ఓకే చెప్పిన జాన్వీ కపూర్

Monday, December 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజయ్ దేవరకొండకి ఓకే చెప్పిన జాన్వీ కపూర్

విజ‌య్ దేవ‌ర‌కొండ ప్యాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధ‌మ‌వుతుంది. నిజానికి విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజ్‌ను మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు సౌత్ రేంజ్‌కు తీసుకెళుతుంటే డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ విజ‌య్‌ని త‌న ఫైట‌ర్‌తో ప్యాన్ ఇండియా హీరోను చేయ‌బోతున్నాడు. అందుకు త‌గిన విధంగా క‌థ‌ను కూడా సిద్ధం చేస్తున్నాడు. తెలుగులో పూరి ద‌ర్శ‌క‌త్వంలో పూరి, ఛార్మి నిర్మించ‌బోయే ఈ సినిమా జ‌న‌వ‌రి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఇక ఉత్త‌రాదిన ఈ సినిమాను క‌ర‌ణ్ జోహార్ విడుద‌ల చేయ‌బోతున్నారు. చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయి. క‌ర‌ణ్ జోహార్ సీన్‌లోకి రాగానే `ఫైట‌ర్` రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా మార్చ‌డానికి అన్ని హంగులు అద్దుతున్నారు.

అందులో భాగంగా ఇప్పుడు జాన్వీక‌పూర్‌ను హీరోయిన్‌గా న‌టింప చేయ‌బోతున్నార‌ట‌. ముందుగా పూరి జ‌గ‌న్నాథ్ జాన్వీక‌పూర్‌ను న‌టింప చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేసినా ఆమె డైరీ ఫుల్‌గా ఉండ‌టంతో ఆమె చూద్దాం.. చేద్దాం అంటూ వ‌చ్చింది. అయితే క‌ర‌ణ్ జోహార్ ఆమెను ఒప్పించాడు. త‌న‌కు సినీ గురువు అయిన క‌ర‌ణ్ జోహార్ కోర‌డంతో జాన్వీ క‌పూర్ నో చెప్ప‌లేక‌పోయింది. సినిమా జ‌న‌వ‌రి నుండి స్టార్ట్ అయితే జాన్వీక‌పూర్ మాత్రం సెట్స్‌లో ఫిబ్ర‌వ‌రి నుండి జాయిన్ అవుతుంద‌ట‌. మొత్తానికి పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో జాన్వీ సౌత్ ఎంట్రీ ఇవ్వ‌నుండ‌టం ఖాయంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.