close
Choose your channels

'జ్యో అచ్యుతానంద' సెన్సార్ పూర్తి

Wednesday, August 31, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మించిన చిత్రం `జ్యో అచ్యుతానంద`. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.నారారోహిత్‌, నాగ‌శౌర్య‌, రెజీనాల మ‌ధ్య జ‌రిగే క్యూట్ ఫ్యామిలీ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ అయిన ఈ చిత్రంలో నారా రోహిత్‌, నాగ‌శౌర్య‌లు అన్న‌ద‌మ్ములుగా న‌టించారు. ఎమోష‌న్స్‌, ఎంట‌ర్‌టైన్మెంట్ క‌ల‌గ‌లిసిన ముగ్గురు వ్య‌క్తుల మ‌ధ్య జ‌రిగే సున్నిత‌మైన క‌థాంశం. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ `యు` స‌ర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ పూర్తి కావ‌డంతో సినిమా రిలీజ్ సెప్టెంబ‌ర్ 9న రావ‌డం ఖాయ‌మైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.