జ్యోతిక ఇప్పుడు బిజీ స్టార్!
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
గతేడాది ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు సినిమాల్లో నటించేసింది జ్యోతిక. `నాచ్చియార్`, `కాట్రిన్ మొళి`, `చెక్క చెవంద వానం`... మూడూ హిట్ కావడంతో ఆమెను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా పాత్రలు రాస్తున్నారు. దక్షిణాది విద్యాబాలన్గా ఆమెను ప్రశంసిస్తున్నారు. తాజాగా ఆమె ఎస్.రాజ్ దర్శకత్వంలో మరో సినిమా కూడా పూర్తి చేసింది.
సోషల్ మెసేజ్ ఉన్న సినిమా ఇది. దీని తర్వాత ఆమె కామెడీ ఎంటర్టైనర్లో నటించనున్నారు. ఈ సినిమాను సూర్య సొంత సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ నిర్మించనుంది. ఈ సినిమాలో ఆమెతో పాటు భారతీరాజా, కె.భాగ్యరాజ్ , ఆర్.పార్తీబన్ నటించనున్నారు. వీరి ముగ్గురూ తమిళంలో దర్శకులన్న విషయం తెలిసిందే. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.