close
Choose your channels

జ‌య‌ల‌లిత‌గా కాజోల్‌

Tuesday, April 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జ‌య‌ల‌లిత‌గా కాజోల్‌

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో పుర‌ట్చి త‌లైవి జ‌య‌ల‌లితది ప్ర‌త్యేక స్థానం. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత‌క‌థ‌ను సినిమా రూపంలో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే జ‌య‌ల‌లిత‌పై మూడు బ‌యోపిక్స్ రూపొందుతుండ‌గా .. సోమ‌వారం మ‌రో బ‌యోపిక్ గురించిన వార్త ప్ర‌క‌టించారు ద‌ర్శ‌క నిర్మాత కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌రరెడ్డి. `శ‌శిల‌త` పేరుతో తెర‌కెక్క‌బోయే ఈ బ‌యోపిక్‌లో జ‌య‌ల‌లిత పుట్టిన‌రోజు నుండి చ‌నిపోయే వ‌ర‌కు జ‌రిగిన ముఖ్య ప‌రిణామాల‌ను చూపిస్తార‌ట‌. అలాగే జ‌య‌ల‌లిత‌, శ‌శిక‌ళ మ‌ధ్య స్నేహ బంధం గురించి కూడా ఇందులో చూపిస్తామ‌ని తెలిపారు కేతిరెడ్డి. ఈ సినిమాలో జ‌య‌ల‌లిత పాత్ర కోసం బాలీవుడ్ న‌టి కాజోల్‌ను .. శ‌శిక‌ళ పాత్ర కోసం అమ‌లాపాల్‌ను తీసుకోవాల‌నుకుంటున్నామ‌ని కూడా ఈ సంద‌ర్భంగా ఓ ప‌త్రిక‌కు తెలియ‌జేశారాయ‌న‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.