close
Choose your channels

Kalyanam Kamaneeyam:'కళ్యాణం కమనీయం' ఫస్ట్ లుక్ విడుదల

Friday, December 9, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "కళ్యాణం కమనీయం". ఈ చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. తాజాగా కళ్యాణం కమనీయం సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ టైటిల్ మోషన్ పోస్టర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ప్లెజంట్ విజువల్స్ కు అంతే అందమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకుంది. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మిస్తూ యువ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్న యూవీ కాన్సెప్ట్స్  ఈ చిత్రంతో మరో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ప్రేక్షకులకు అందించబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న  ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - కార్తిక్ ఘట్టమనేని, ఎడిటర్ - సత్య జి, సంగీతం - శ్రావణ్ భరద్వాజ్, సాహిత్యం - కృష్ణ కాంత్, కొరియోగ్రాఫర్స్ - యష్, విజయ్ పోలంకి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నరసింహ రాజు, ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్, లైన్ ప్రొడ్యూసర్ - శ్రీధర్ రెడ్డి ఆర్, సహ నిర్మాత - అజయ్ కుమార్ రాజు పి, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాణం - యూవీ కాన్సెప్ట్స్, రచన దర్శకత్వం - అనిల్ కుమార్ ఆళ్ల.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.