close
Choose your channels

'కాష్మోరా' ఆడియో హక్కులను

Wednesday, September 28, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్‌ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకాలపై గోకుల్‌ దర్శకత్వంలో పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా'. ఈ సినిమా ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం అక్టోబర్ 7న నిర్వహించనున్నారు. సినిమాను తెలుగు, త‌మిళంలో అక్టోబ‌ర్ 28న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో కార్తీ మూడు డిఫ‌రెంట్ గెట‌ప్స్‌లో క‌నిపించ‌నున్నాడు. అందులో ఒక గెట‌ప్‌ను చిత్ర‌యూనిట్ రిలీజ్ చేసింది. ఈ లుక్ లో కార్తీ కొత్త‌గా ఉన్నాడ‌ని అంద‌రూ అప్రిసియేట్ చేస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం క‌బాలి ఫేం సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు, త‌మిళ ఆడియో హ‌క్కుల‌ను థింక్ మ్యూజిక్ ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో ద‌క్కించుకుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.