close
Choose your channels

'రుద్రమదేవి'కి కేసీఆర్ వరం..

Thursday, October 8, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ వీర‌నారి రుద్ర‌మ‌దేవి చ‌రిత్ర ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌క నిర్మాత‌గా గుణ‌శేఖ‌ర్ నిర్మించిన భారీ చిత్రం 'రుద్ర‌మ‌దేవి'. దాదాపు డెబ్బై కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాని గుణ‌శేఖ‌ర్ రూపొందించాడు. ఈ సినిమాలో అనుష్క‌, రానా, అల్లుఅర్జున్ త‌దిత‌రులు న‌టించారు. త్రీడీ టెక్నాల‌జీతో హిస్టారిక‌ల్ స్టీరియోస్కోపిక్ చిత్రంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా తీసినందుకు తెలంగాణ ప్రభుత్వం అప్ప‌ట్లో ఎంట‌ర్‌టైన్మెంట్ ట్యాక్స్(వినోద‌పు ప‌న్ను) తొలిగిస్తామ‌ని తెలియ‌జేసింది. ఇప్పుడు అన్న‌మాట‌ను నిల‌బెట్టుకుంది. కేసీఆర్ ట్యాక్స్ ను తొల‌గించారు.గుణ‌శేఖ‌ర్‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఆదివారంనాడు కేసీఆర్ రుద్ర‌మ‌దేవి చిత్రాన్ని వీక్షిస్తార‌ని ఫిలింవ‌ర్గాల స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.