close
Choose your channels

మాధ‌వి ల‌త 'లేడీ' టీజ‌ర్ విడుద‌ల‌

Saturday, September 5, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాధ‌వి ల‌త లేడీ టీజ‌ర్ విడుద‌ల‌

టాలెంటెడ్ బ్యూటీ మాధవి లత హీరోయిన్ గా ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీ తో లేడీ అనే సినిమా సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. మాధ‌వి ల‌త‌ సోలో పెర్ఫార్మన్స్ లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఛరన్స్ క్రియేషన్స్, జీ ఎస్ ఎస్ ఎస్ పీకే స్టూడియోజ్ బ్యానెర్లు పై సత్యనారాయణ గొరిపర్తి, జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్ ఈ రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా నిర్మిస్తున్నారు.

ఈ మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీకి సంబంధించిన టీజ‌ర్ ని తాజాగా చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీ తో ఈ సినిమాను రెడీ చేస్తున్నామన్నారు కళ్యాణ్. సినిమా ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకులును ఆకట్టుకునే రీతిన తీర్చిదిద్దినట్లుగా కళ్యాణ్ చెప్పారు. అదే రీతిన తాజాగా విడుద‌ల చేసిన టీజ‌ర్ ని కూడా రెడీ చేశారు లేడీ చిత్ర యూనిట్ స‌భ్యులు. ఈ సినిమాకి మధివి లత నటన ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని, సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నట్లుగా చిత్రం బృందం తెలిపింది. చిత్రానికి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత సత్యనారాయణ చెప్పారు.

తారాగణం : మాధవి లత

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.