మహేష్ సినిమా వెనక్కి వెళ్లిందా
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ 25వ చిత్రం 'మహర్షి'. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వినీదత్, దిల్‌రాజు, పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే సినిమా విడుదల వెనక్కి వెళ్లినట్టుగా అనిపిస్తుంది.
ఎందుకంటే నాగచైతన్య, సమంత 'మజిలీ' చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. మహేష్ సినిమాకు పోటీగా చైతన్య రాడు. అలాగే మరో వారం తర్వాత అంటే ఏప్రిల్ 12న సాయిధరమ్ తేజ్, మైత్రీ మూవీస్ 'చిత్రలహరి' సినిమా రిలీజ్‌ను అనౌన్స్ చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్‌లో మహేష్, సుక్కు సినిమా ఉంది కాబట్టి.. మహేష్ పర్మిషన్ లేకుండా వారు పోటీలోకి రారు. అంటే జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే.. మహేష్ సినిమా వెనక్కి వెళ్లినట్టేనని సినీ వర్గాలు అంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.