close
Choose your channels

ఏప్రిల్ 1, 2022న రిలీజ్‌కానున్న‌ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’

Wednesday, November 3, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్ర యూనిట్ స్పెయిన్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. పరుశురామ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన విడుదల విషయంలో అతి పెద్ద అప్డేట్ వచ్చింది.

సర్కారు వారి పాట చిత్రం వచ్చే ఏడాది ఉగాది సందర్బంగా ఏప్రిల్ 1న విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌కు రాబోతోన్నట్టు ప్రకటించిన పెద్ద చిత్రం ఇదే. ఈ సినిమాకు వేసవి సెలవులు కలిసి రానున్నాయి. హాలీడే సమయంలో విడుదలైన మ‌హేష్ బాబు పోకిరి, భరత్ అనే నేను, మహర్షి వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

ఇప్పటికే రిలీజైన‌ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగ‌వంతం చేయ‌నుంది.

మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.