close
Choose your channels

కరోనాకు ఇదే అసలైన మందు..: మహేశ్ బాబు

Tuesday, March 17, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనాకు ఇదే అసలైన మందు..: మహేశ్ బాబు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ చాలా వరకు జనాల్లోకి వెళ్లలేదు. ఏ సమాచారమైనా ప్రజల్లోకి వెళ్లాలంటే దానికి బలమైన మాధ్యమం కూడా ఉండాలన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలను సినీతారలు చెబితే ప్రజల్లోకి త్వరగా వెళ్తాయి. అందుకే టాలీవుడ్ మొదలుకుని హాలీవుడ్ వరకూ నటీనటులు తమ వంతుగా అభిమానులు, యావత్ ప్రజానీకానికి సలహాలు, సూచనలు చేస్తూ.. తగు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

ఇప్పటికే క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ప్రభుత్వమే ఓ వీడియో చేయించింది. మరోవైపు టాలీవుడ్ నటీనటులు కూడా తమ వంతుగా అభిమానులు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తగు జాగ్రత్తలు చెబుతూ సలహాలు, సూచనలు చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు.

ఇదే సరైన మందు!

‘సామాజిక దూరం పాటించడమే దీనికి సరైన మందు. మన సామాజిక జీవితాన్ని త్యాగం చేసి సమాజ భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలి. సామాజిక దూరం పాటించడం ఇప్పుడు చాలా అవసరం. ఇది చాలా కష్టమైన పని అయినప్పటికీ తప్పదు. సామాజిక జీవితాన్ని త్యాగం చేసి సమాజ భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలి’ అని మహేశ్ సూచించాడు. ఈ సందర్భంగా వరుసగా ఉన్న అగ్గిపుల్లలని కాలిపోతుండగా.. ఒక అగ్గిపుల్ల పక్కకు తప్పుకుంటుడం.. అక్కడితో మంట ఆరిపోతున్న వీడియోను మహేశ్ షేర్ చేశాడు.

చిట్కాలు ఇవీ..

- అత్యవసరాలు తప్ప మిగిలిన సందర్భాల్లో ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో గడపండి
- మీ చేతులను తరచూ శుభ్రం చేసుకోండి. అంతేకాదు.. మీ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి.
- హ్యాండ్ శానిటైజర్స్‌ను వాడండి.
- ఆరోగ్యం బాగోలేకపోతే మాస్క్‌లను వాడండి.
- వైరస్ పూర్తిగా తొలగిపోయే వరకు ఈ జాగ్రత్తలు పాటిద్దాం అని మహేశ్ సూచించాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos