close
Choose your channels

ఈనెల 23న మజ్ను విడుదల

Thursday, September 8, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌, గోళ్ళ గీత అందిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మజ్ను. ఈ చిత్రాన్ని ఈనెల‌ 23న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు విరించివర్మ మాట్లాడుతూ...ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు చాలా మంచి స్పందన లభిస్తోంది. గోపిసుందర్‌ సారధ్యంలో రూపొందిన అన్ని పాటలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. అలాగే ట్రైలర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. నాని కెరీర్‌లో మజ్ను మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. ఈ చిత్రాన్ని ఈనెల‌ 23న విడుదల చేయ‌డానికి ప్లానింగ్‌ జరుగుతోంది అన్నారు.
నేచురల్‌ స్టార్‌ నాని, ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌., సంగీతం: గోపీసుందర్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, దర్శకత్వం: విరించి వర్మ. ​

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.