close
Choose your channels

'మ‌మాంగం' గురించి మ‌మ్ముట్టి ఏమ‌న్నారంటే?

Monday, June 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌మాంగం గురించి మ‌మ్ముట్టి ఏమ‌న్నారంటే?

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి ప్ర‌స్తుతం `మ‌మాంగం` అనే భారీ హిస్టారిక‌ల్ మూవీలో న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఇది 17వ శ‌తాబ్దానికి చెందిన క‌థ‌. జామెరిన్ పాల‌న‌లో చావెరుక్క‌ల్ యుద్ధ వీరుల చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం రూ.10 కోట్ల‌తో భారీ సెట్‌ను నిర్మించారు.

ఈ సినిమా గురించి మ‌మ్ముట్టి మాట్లాడుతూ `` మ‌మాంగం` చిత్రాన్ని రెండు రాజ్యాల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. కేర‌ళ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను తెలియ‌జేసే చిత్ర‌మిది`` అన్నారు. షూటింగ గ్యాప్‌లో కూడా తాను సినిమాలో చేయ‌బోయే సీన్ గురించే ఆలోచిస్తుంటాన‌ని లేదా త‌న కుటుంబం గురించి ఆలోచిస్తుంటాన‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.