close
Choose your channels

డైరెక్టర్ మారుతి 'బ్రాండ్ బాబు' ఫస్ట్ లుక్ విడుదల !

Monday, July 9, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డైరెక్టర్ మారుతి బ్రాండ్ బాబు ఫస్ట్ లుక్ విడుదల !

బ్రాండ్ బాబు టైటిల్ పోస్టర్ మరియు ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు కథ అందించడంతోపాటు సమర్పిస్తున్నారు.

సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పి.ప్రభాకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు మురళి శర్మ ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్, పి.సాయికుమార్ నటిస్తున్నారు.

ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో టీజర్ ను విడుదల చెయ్యబోతున్నారు. జీవన్ బాబు (జే. బి) ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా కార్తీక్ ఫలని సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్ బ్యానర్ పై ఎస్. శైలేంద్ర ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.