close
Choose your channels

లీకుల‌పై మెగాస్టార్ అస‌హ‌నం?

Wednesday, March 18, 2020 • తెలుగు Comments

లీకుల‌పై మెగాస్టార్ అస‌హ‌నం?

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య‌’ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. అయితే ఈ సినిమా అనుకున్న‌ప్ప‌టి నుండి మేకింగ్‌లో ఏదో ఒక అవాంత‌రం ఏర్ప‌డుతూనే ఉంది. సినిమా ఆల‌స్య‌మవుతూనే ఉంది. సైరా ఆల‌స్యం ఆచార్య మేకింగ్‌పై ప‌డింది. స‌రే! అనుకుని స్టార్ట్ చేస్తే.. సినిమాలో కీలక పాత్ర కోసం రామ్‌చ‌ర‌ణ్‌ను అనుకున్నారు. కానీ రామ్‌చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్‌లో బిజీగా ఉండ‌టం.. త‌న పార్ట్ షూటింగ్ పూర్తి కాక‌పోవ‌డంతో చ‌ర‌ణ్..చిరు 152లో న‌టించ‌డం డౌటే అన్న సందేహం క‌లిగింది.

ఈరోపు కొర‌టాల మ‌హేశ్‌ను సంప్ర‌దించ‌డం.. ఆయ‌న కూడా ఓకే అన్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. అయితే మ‌హేశ్ హై రెమ్యున‌రేష‌న్ కోట్ చేశాడ‌ని చిరు అసంతృప్తితో చ‌ర‌ణ్ కోసం ఆగుదామ‌ని అనుకున్నాడు. తిరిగి మ‌ళ్లీ చ‌ర‌ణ్ లైన్‌లోకి వ‌చ్చాడు. ఈ విష‌యాల‌న్నీ చిత్ర యూనిట్ అనౌన్స్ చేయ‌కుండానే సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూ వ‌చ్చాయి. ఓసారి చిరంజీవి లుక్ కూడా లీకైంది. ఏ సినిమాకు రాన‌ట్లు ఆచార్య విష‌యంలోనే ఇన్ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేయ‌డ‌మేంటోన‌ని చిరు త‌న ప్రొడ‌క్ష‌న్ హౌస్ టీమ్‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశాడ‌ట‌. మ‌రి ఈ వార్త‌ల‌కు ఆచార్య టీమ్ ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో వేచి చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz