close
Choose your channels

చైనాకు మెగాస్టార్‌...

Friday, March 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చైనాకు మెగాస్టార్‌...

మెగాస్టార్ చిరంజీవి ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇక్క‌డ ఉండ‌టం లేదా? అంటే అవున‌నే అంటున్నాయి సినీ వ‌ర్గాలు. ఎందుకంటే `సైరా న‌రసింహారెడ్డి` సినిమా కోసం అని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న `సైరా న‌ర‌సింహా రెడ్డి`. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్రం. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన తొలి యోధుడు ఓ తెలుగువాడు.. ఆయ‌నే ఉయ్యాల‌వాడ న‌ర‌సింహా రెడ్డి. ఆయ‌న జీవిత చ‌రిత్ర‌నే `సైరా న‌ర‌సింహారెడ్డి`గా తెర‌కెక్కిస్తున్నారు.

భారీ బ‌డ్జెట్‌తో సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో 200 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మాత రాంచ‌ర‌ణ్ ప్రెస్టీజియ‌స్‌గా రూపొందిస్తున్న చిత్ర‌మిది. ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. కొర‌టాల శివ వెయిటింగ్‌లో ఉండ‌టంతో.. మ‌రో రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాల‌ని చిరు భావిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా 20 రోజుల పాటు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చైనాలో చిత్రీక‌రించేలా ప్లాన్స్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ వ‌చ్చే నెల‌లోనే ఉండటంతో ఎన్నిక‌ల స‌మయానికి చిరు చైనాలో ఉండ‌బోతున్నారట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.