close
Choose your channels

దర్శకుడి మాట - మనస్సుకు దగ్గరైన 'మిఠాయి'

Saturday, January 13, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హలో ఫ్రెండ్స్, ఈ అనౌన్స్మెంట్ కి టైం పట్టింది. నిజం చెప్పాలంటే అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ టైంనే తీసుకున్నా. కాని ఇప్పుడు నా ఫస్ట్ సినిమా షూటింగ్ ని అనౌన్స్ చేస్తున్నాను. అవును అది తెలుగు మూవీనే. నా తెలుగు కేవలం 'చెప్పండి, చూడండి, కూర్చోండి లాంటి చిన్న చిన్న పదాలకే పరిమితం. నేను ఇక్కడ 15 సంవత్సరాల నుండి ఉంటున్నాను, కాని కేవలం 9 తెలుగు సినిమాలే చూసాను. వాటిలో రెండు నా ఫ్రెండ్స్ చేసినవే. వాళ్ళిద్దరూ ప్రముఖులే. వాళ్ళు నన్ను ఇంకా సినిమా చేయకపోతే చంపేసేలా ఉన్నారు. ప్రతిదానికి టైం రావాలి అంటారు కదా, అలానే ఇప్పుడు నేను నా సినిమా 'మిఠాయి'తో రెడీ గా ఉన్నాను.

'మిఠాయి' ఒక డార్క్ కామెడీ మూవీ. అవును, ఎంత డార్క్ కామెడీ అంటే, ఈ సినిమా లో మంచి వాళ్లకి అన్నీ చెడు జరుగుతూ ఉంటే, చెడ్డ వాళ్ళుగా చెప్పబడే వాళ్లకి మాత్రం అన్నీ మంచే జరుగుతూ ఉంటాయి. ఈ సినిమా నా ఫేవరెట్ ఫిలిం మేకర్స్ "కోయెన్ బ్రదర్స్" కి ట్రిబ్యూట్ లాంటిది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది చాలా డార్క్ గా, నైరూప్యంగా (ఆబ్స్ట్రాక్ట్), అధివాస్తవికంగా (సర్రియల్), ముఖ్యంగా సారూప్యంగా ఉంటుంది. వివేక్ సాగర్ ఈ సినిమాకి అద్బుతమైన మ్యూజిక్ ఇస్తున్నాడు. చాలా కొత్త రకమైన ఇన్స్ట్రుమెంట్స్, సౌండ్స్ ట్రై చేస్తున్నాము.

ఈ సినిమా రాసేదప్పుడు ప్రతి క్షణాన్ని చాలా ఎంజాయ్ చేసాను. ఈ సినిమా రాయడం పూర్తయ్యాక ఒక మూడు, నాలుగు రోజులు చాలా బాధపడ్డాను. ఎందుకంటే రాస్తున్న టైం లో ప్రతి పాత్రలోకి ప్రవేశించి వారి వారి జీవితాలను నేను గడిపాను. నేను అబ్బాయిగా, అమ్మాయిగా, ముసలివాడిగా, పోలీసుగా ఒకేసారి ఉండగలిగాను. ఇప్పుడు రాయడం పూర్తయ్యింది కాబట్టి నేను నిర్మించిన ప్రపంచంలోకి వెళ్లి, ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయాల్సిన బాధ్యత ఆయా నటులపై ఉంది. ఆ బాధ్యత తీసుకున్న ఈ సినిమా నటీ నటులకి నా ధన్యవాదాలు.

ఒక డైరెక్టర్ గా ప్రేక్షకులను అమితంగా గౌరవిస్తాను. ఎందుకంటే నేను వాళ్ళు ఒక డైరెక్టర్ కంటే తెలివైన వారని నమ్ముతాను. ఒక సినిమా ఫెయిల్ అయ్యిందంటే, ఒక డైరెక్టర్ తను చెప్పాల్సినది సరిగ్గా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడనే అర్ధం. నేను ఒక మంచి, నిజాయితీ గల సినిమా చేయడానికి సంకల్పించాను. సినిమా హిట్ అయితే సంతోషిస్తాను. కాని ఫెయిల్ అయితే ఫీల్ అవ్వను. నేను ఎక్కడో పొరపాటు చేసానని అర్ధం చేసుకుని, ఆ ఫెయిల్యూర్ కి పూర్తి బాధ్యత తీసుకుంటాను.

నా కంపెనీ రెడ్ యాంట్స్ త్వరలోనే రెండో సినిమాతో ముందుకు వస్తుంది. రెడ్ యాంట్స్ బ్యానర్ నుండి సంవత్సరానికి రెండు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాము. ఒకటి నేను డైరెక్ట్ చేస్తాను, రెండోది ఎవరైనా మంచి, నిజాయితీగల, ఇంటెలిజెంట్ కధతో వస్తే చేస్తాము. నేను చెప్పదలుచుకున్నది ఇదే.

థాంక్యు,

డైరెక్టర్ ప్రశాంత్ కుమార్

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.