close
Choose your channels

'MLA' మార్చ్ లో విడుదల

Sunday, January 14, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా,నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం లో రూపొందుతోన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ 'MLA'. "మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్" అనేది కాప్షన్. ఈ చిత్రం లో అందాల భామ కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

T.G. విశ్వప్రసాద్ సమర్పణ లో ,బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ LLP మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ LLP బ్యానర్ ల సంయుక్త నిర్మాణం లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వచ్చే నెల ఫారిన్ షెడ్యూల్ లో పాటల చిత్రీకరణ తో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకుంటుంది.

"ఆధ్యంతం వినోదభరితం గా సాగే ఈ చిత్రం హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక మంచి చిత్రం అవుతుంది అని నమ్ముతున్నాం. నూతన దర్శకుడు ఉపేంద్ర ఈ చిత్రాన్ని చాలా వినోదభరితం గా మలచారు. మర్చి లో వేసవి సెలవుల సందర్భం గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రం టీజర్ ను నేడు విడుదల చేయగా, విశేష స్పందన లభించింది ", అని నిర్మాతలు తెలిపారు.

" టోటల్ న్యూ లుక్ లో ఎంతో స్టైలిష్ గా కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా లో కనపడతారు. నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారి కి, చిత్ర నిర్మాతల కి కృతఘ్నతలు తెలుపుతున్నా. MLA అనే టైటిల్ కి, కాప్షన్ కి పూర్తి జస్టిఫికేషన్ ఉంటుంది", అని దర్శకులు ఉపేంద్ర అన్నారు.

రవి కిషెన్, పోసాని , జయప్రకాశ్ రెడ్డి, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, శివాజీ రాజా,ప్రభాస్ శ్రీను, లాస్యా , మనాలి రాథోడ్ ఈ చిత్రం లో ని ప్రధాన నటులు.

ఈ చిత్రానికి సమర్పణ : T.G. విశ్వప్రసాద్ , రచనా సహకారం : ప్రవీణ్ వర్మ, ఆది నారాయణ, సంగీతం: మని శర్మ , సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ , ఎడిటింగ్‌: తమ్మిరాజు , సమర్పణ : T.G. విశ్వప్రసాద్ , కో ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభొట్ల , నిర్మాతలు : C భరత్ చౌదరి మరియు M. V. కిరణ్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.