close
Choose your channels

మళ్లీ మోహన్ బాబు వర్సెస్ వైవీఎస్ చౌదరి.. ఈసారి ఏకంగా..!!

Tuesday, April 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైవీఎస్ చౌదరిపై మోహన్ బాబు బెదిరింపులు!!

టాలీవుడ్ దర్శకుడు వైవీఎస్ చౌదరి.. ప్రముఖ నటుడు, నిర్మాత, వైసీపీ నేత మోహన్ బాబు మధ్య వివాదాలకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడేలాలేదు. మొన్న కోర్టు తిర్పునిచ్చిన తర్వాత మోహన్ బాబు డబ్బులు చెల్లించేస్తే వ్యవహారం ఇంతటితో ముగుస్తుందనకుంటే ఇప్పుడు మరింత ముదిరింది. దీంతో మరోసారి చౌదరి కోర్టు మెట్లెక్కేందుకు సిద్ధమయ్యారు. అసలేం జరిగింది..? మళ్లీ వివాదం ఎందుకొచ్చింది..? అనే విషయాలు చౌదరి మాటల్లోనే తెలుసుకుందాం.

కోర్టు తీర్పు మీకు తెలిసిందే...

"వైవిఎస్‌ చౌదరి అను నేను శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై మోహన్‌బాబు నిర్మించిన, 'సలీమ్‌' (2009) చలన చిత్రం యొక్క దర్శకత్వపు బాధ్యతలను నిర్వర్తించినందుకుగానూ, రెమ్యూనరేషన్‌ నిమిత్తం మోహన్‌బాబు నాకు బాకీ పడ్డ రూ. 40,50,000 చెక్‌ విషయమై.. నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించగా దాదాపు 9 సంవత్సరాల అనంతరం '23వ స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు' ఎర్రమంజిల్‌, హైదరాబాద్‌ వారు.. 2 ఏప్రిల్‌ 2019న నాకు అనుకూలంగా తీర్పు వచ్చిన విషయం మీ అందరికీ తెల్సినదే" అని చౌదరి గుర్తు చేశారు. 

మొన్న చెక్స్, ఇప్పుడేమో ల్యాండ్..

"ఈ నేపథ్యంలో మోహన్‌బాబు.. సదరు న్యాయసానాన్ని నేను తప్పుదోవ పట్టించినట్లుగా తీర్పు వెలువడిన తదనంతర పత్రికా ప్రకటనలో పేర్కొనడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పుడు మోహన్‌బాబు‌ జల్‌పల్లి గ్రామం.. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఇంటిని ఆనుకొని.. నా ఇంటి నిర్మాణానికై 'సలీమ్‌' చిత్ర నిర్మాణ సమయంలోనే నేను కొనుక్కున్న అర ఎకరం స్థలంలోకి, పైన పేర్కొన్న చెక్‌ బౌన్స్‌ కేసు కోర్టు తీర్పు తరువాత నన్ను, నా మనుషుల్ని నా స్థలంలోకే రానీకుండా అడ్డుకోవడం, ఆటంకాలు కల్పించడం తీవ్ర మనస్థాపాన్ని కలిగించింది. నా కష్టార్జితంతో నేను కొనుక్కున్న నా ఇంటి స్థలం విషయంలో ఆయన సమస్యలు సృష్టిస్తుండటంతో, ఇన్నేళ్లగా జరిగిన, జరుగుతున్న ఉదంతాలపై శాశ్వత పరిష్కారం కోసం నేను న్యాయనిపుణులను ఆశ్రయించడమైనది. పూర్తి వివరాలకై మా న్యాయవాదులు ఆయనకు పంపిన లీగల్‌ నోటీసును ఈ లేఖతో జతచేయడమైనది, గమనించగలరు. ఎల్లప్పుడూ మీ సహాయసహకారాలను కాంక్షించే  మీ వైవిఎస్‌ చౌదరి సినీ దర్శక-నిర్మాత" అని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై మంచు ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.