close
Choose your channels

'సవ్యసాచి' టీజర్ ఎప్పుడంటే..

Tuesday, June 26, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సవ్యసాచి టీజర్ ఎప్పుడంటే..

యువ క‌థానాయ‌కుడు నాగచైతన్య హీరోగా యంగ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సవ్యసాచి'. ఈ చిత్రంలో చైతు సరసన నిధి అగర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో భూమిక, మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

'వెన్నెల' కిషోర్, రావురమేష్, ముకుల్ దేవ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. అలాగే.. మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ఐటెమ్ సాంగ్‌లో మెర‌వ‌నుంది. గతంలో ఈ జంట '100% లవ్', 'తడాఖా' లాంటి చిత్రాలతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా టీజర్‌ను జూలై 6న గాని లేదా 7న గాని రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

కాగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఆగష్టు నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 'ప్రేమమ్' తర్వాత చైతు, చందుల కలయికలో వస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలే నెలకొన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.