close
Choose your channels

'అశ్వ‌థ్థామ' డ‌బ్బింగ్ చెబుతున్న నాగ‌శౌర్య‌

Monday, December 30, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అశ్వ‌థ్థామ డ‌బ్బింగ్ చెబుతున్న నాగ‌శౌర్య‌

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`. ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. రీసెంట్‌గా విడుద‌లైన నిన్నే నిన్నే సాంగ్‌, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

అశ్వ‌థ్థామ డ‌బ్బింగ్ చెబుతున్న నాగ‌శౌర్య‌

ఈ రెస్పాన్స్‌తో నాగ‌శౌర్య మ‌రింత ఉత్సాహాంగా డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. యథార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా హీరో నాగ‌శౌర్య ఈ క‌థ‌ను రాశారు. కేవ‌లం యాక్ష‌న్ ఎలిమెంట్సే కాదు.. మంచి మెసేజ్ ఉన్న చిత్రంగా సినిమాను రూపొందిస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి జ‌న‌వ‌రి 31న సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

న‌టీన‌టులు: నాగ‌శౌర్య‌, మెహ‌రీన్ త‌దిత‌రులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.