close
Choose your channels

చిరు బయోపిక్‌ పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Friday, February 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరంజీవి బ‌యోపిక్ గురించి నాగ‌బాబు వ్యాఖ్య‌

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్‌‌ల ట్రెండ్ నడుస్తోందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్‌‌లో ఇప్పటికే ‘మహానటి’, ‘కథానాయకుడు’, ‘యాత్ర’ బయోపిక్‌లు థియేటర్లలోకి వచ్చాయి. త్వరలో ‘మహా నాయకుడు’కూడా రాబోతోంది. మరోవైపు వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు త్వరలోనే పలువురు ప్రముఖుల బయోపిక్‌‌లు రాబోతున్నాయి కూడా. అయితే టాలీవుడ్ టాప్ హీరో.. మెగాస్టార్ చిరంజీవిపై బయోపిక్ వస్తుందా..? ఒక వేళ వస్తే దాన్ని ఎవరు తెరకెక్కిస్తారు..? ఎవరు నిర్మిస్తారు..? ఇంతకీ బయోపిక్ తీసే ఆలోచన ఉందా లేదా..? అనే విషయాలను చిరు సోదరుడు నాగబాబు అడిగితే ఆయన ఏమని సమాధానం ఇచ్చారో మీరే చూడండి.

ఉన్నది ఉన్నట్టు తీస్తే సరే..

ఏ బయోపిక్ అయినా సరే.. ఉన్నది ఉన్నట్లు తీస్తే అది బయోపిక్ అవుతుంది తప్ప ఫేబ్రికేట్ చేస్తే అది పురాణం అవుతుందన్నారు. తీసే కథలో నిజం చెప్పాలని.. ఇప్పటి వరకూ తాను దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘కథానాయకుడు’, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పాదయాత్ర గురించి తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమాలను చూడలేదన్నారు. కథానాయకుడు, యాత్ర సినిమాలను చూసిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

చిరు బయోపిక్‌‌పై నాగబాబు ఏమన్నారంటే..

"మా అన్నయ్య చిరంజీవిపై నేను నిర్మాతగా సినిమా తీయలనే ఉద్దేశం లేదు. ఆయన కొడుకు చరణ్ బాబుకి కూడా ఉండి ఉండదు. చిరంజీవి కూడా నా మీద బయోపిక్ తీస్తే బావుండు అని అనుకోరు. ఎందుకంటే ఆయనది అంత సెల్ఫ్ ప్రమోషన్ ఉన్న వ్యక్తిత్వం కాదు" అని నాగబాబు చెప్పుకొచ్చారు.

సిల్క్‌స్మిత అంత గొప్పనటి కాదు..  !

"బయోపిక్ తీయాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఇన్ని సినిమాలు వచ్చినా సిల్క్‌స్మిత్ బయోపిక్ ‘డర్టీ పిక్చర్’ ఎందుకు బావుంటుంది!? అది ఒక ఆడపిల్ల జీవితంలో ఎలాంటి కష్టాలు.. ఇబ్బందులు ఎదుర్కొందని రియలిస్టిక్‌గా చూపించారు. సిల్క్‌స్మిత.. మహానటి సావిత్రి అంత గొప్పనటి కానే కాదు. కానీ ఆమె బయోపిక్‌ సక్సెస్ అయ్యింది. అలాగే సంజయ్ దత్‌పై సంజూ సినిమా తీస్తే క్లిక్ అయ్యింది. ఎప్పుడూ సక్సెఫుల్ వ్యక్తి మీద సినిమా తీస్తే అందులో విషయం ఏమీ ఉండదు. జీవితంలో అప్ అండ్ డౌన్స్.. సంతోషం, బాధ, విజయం, అపజయం ఇలా అన్నీ కలిస్తే కథ ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. అల్టిమేట్‌గా బయోపిక్ అనేది ఒక సినిమానే కదా.. ఆ సినిమాలో ఇవన్నీ ఉంటేనే కథలో మజా ఉంటుంది" అని బయోపిక్‌‌లపై నాగబాబు తన మనసునలోని మాటను బయటపెట్టారు.

కాగా.. చిరు బయోపిక్ తెరకెక్కిస్తారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నాగబాబు రియాక్టవ్వడంతో ఆ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టినట్లైంది. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.