close
Choose your channels

Veera Simha Reddy:‘‘ఒంటి చేత్తో ఊచకోత కోస్తా’’ బాలయ్య ఉగ్ర స్వరూపం.. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోన్న వీరసింహా రెడ్డి ట్రైలర్

Saturday, January 7, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Veera Simha Reddy:‘‘ఒంటి చేత్తో ఊచకోత కోస్తా’’ బాలయ్య ఉగ్ర స్వరూపం.. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోన్న వీరసింహా రెడ్డి ట్రైలర్

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘‘వీరసింహారెడ్డి’’. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగా ఈరోజు ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది. పవర్‌ఫుల్ డైలాగ్స్, మాస్ యాక్షన్ సిన్నివేశాలతో నింపేశారు. ఎప్పటిలాగే బాలయ్య మార్క్ డైలాగులు , యాక్షన్ సీన్స్‌తో నింపేశారు.

ఫైట్స్, డైలాగ్స్, డ్యాన్సుల్లో దుమ్మురేపిన బాలయ్య :

తనది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్ అంటూ బాలయ్య చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే విలన్ ఎంట్రీ, వాళ్లు చేసే అరాచకాలు.. వాళ్లను బాలయ్య ఎదుర్కోవడాన్ని చూపించారు. ఫైట్స్, ఎమోషనల్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా బాలయ్య అభిమానులకు కావాల్సిన విందు భోజనాన్ని గోపీచంద్ మలినేని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక చివరిలో ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో - ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు’ అంటూ చెప్పే డైలాగ్ ఈలలు వేయించడం ఖాయం.

సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి:

ఇకపోతే.. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.