close
Choose your channels

‘స్ప్రైట్’‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నేచురల్ స్టార్

Saturday, August 17, 2019 • తెలుగు Comments

‘స్ప్రైట్’‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నేచురల్ స్టార్

థమ్సప్‌కు సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. అపీ ఫిజ్‌కు జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు స్ప్రైట్‌కు నేచురల్ స్టార్ నానీ. టాలీవుడ్‌కు చెందిన నటీనటులు ఎప్పుడూ ఒక్క సినిమానే కాకుండా బిజినెస్‌లు, ప్రకటనలతోనే ఎక్కువగా సంపాదిస్తుంటారన్న విషయం విదితమే. మరీ ముఖ్యంగా రెండేళ్ల పాటు సినిమా తీస్తే వచ్చే డబ్బులు.. రెండు నిమిషాల యాడ్ చేస్తే వచ్చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఫలానా ప్రకటనలు చేయండి..? అని అడిగేది ఆలస్యం.. రెడీగా ఉంటారు.

ఇక అసలు విషయానికొస్తే.. నేచురల్ స్టార్ నానీ ఇప్పుడు ప్రకటనల్లోకి దిగాడు. ఇన్ని రోజులూ ప్రకటనలకు దూరంగా ఉన్న నాని సినిమాకు.. సినిమాకు గ్యాప్ వచ్చేసరికి రంగంలోకి దిగేశాడు. ప్రముఖ శీతల పానీయం అయిన స్ప్రైట్‌కి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియోను నాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. 37సెకన్లు గల ప్రకటనలో నాని నటించాడు. ప్రస్తుతం ఈ ప్రకటన నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది. నాని అభిమానులు మాత్రం ఈ యాడ్ చూసి ఎగిరి గంతేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ట్విట్టర్‌లో ఏం రాసుకొచ్చాడు!?

‘డ్రైవర్ లేకుండా నడిచే కార్లు, వాయిస్ అసిస్టెంట్లు, వన్-టచ్ భద్రత. భవిష్యత్తు ఇక్కడ ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ నా దాహాన్ని తీర్చడానికి ఏదైనా భవిష్యత్ పరికరం ఉందా? తెలుసుకుందాం.. #RefreshmentKaBestIdea @Sprite_india. #MyFirstAD’ అని నాని తన ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. కాగా నాని నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ వచ్చే నెల 13న విడుదల కానున్న విషయం విదితమే.

Get Breaking News Alerts From IndiaGlitz