close
Choose your channels

ప‌వ‌న్ మూవీలో నాని హీరోయిన్స్..!

Thursday, December 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ మూవీలో ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టించ‌నున్నారు.

ఈ ఇద్ద‌రిలో కీర్తి సురేష్ ను ఎంపిక చేసిన టీమ్ ఇక రెండో హీరోయిన్ గా మ‌జ్నుఫేమ్ అను ఇమ్మాన్యూల్ ని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రం ద్వారా యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ను తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నారు. ఈనెల‌లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నేనే లోక‌ల్ సినిమాలో న‌టించిన కీర్తి సురేష్, మ‌జ్ను సినిమాలో న‌టించిన అను ఇమ్మాన్యూల్...ఇలా ఇద్ద‌రినీ నాని హీరోయిన్స్ నే సెలెక్ట్ చేయ‌డం విశేషం..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.