'జెర్సీ' ఓవర్సీస్ రేటెంతంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని హీరోగా `మళ్ళీరావా` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తోన్న సినిమా `జెర్సీ`. ముప్పై ఆరేళ్ల వ్యక్తి దేశ క్రికెట్ టీంకు ప్రాతినిధ్యం వహించాలనుకోవడమే సినిమా ప్రధాన కథాంశం. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుంది.ఏప్రిల్ 19న సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. కాగా ఈ సినిమా ఓవర్సీస్ను 5 కోట్ల రూపాయలకు అమ్మాలని నిర్మాతలు భావిస్తున్నారట.
అయితే నాని గత చిత్రాల్లో నిన్ను కోరి ఓవర్సీస్ హక్కులను కొన్నవారికి లాభాలను తెచ్చి పెట్టింది. నాని కెరీర్లో హయ్యస్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్ సాధించిన భలే భలే మగాడివోయ్ సినిమా ఓవర్సీస్లో 1.43 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసింది. ఇప్పుడు జెర్సీని నిర్మాతలు చెప్పిన రేటుకు కొంటే ఓవర్సీస్లో 1.6 మిలియన్స్‌ను రాబట్టాల్సి ఉంటుంది. మరి నానిపై అంత రిస్క్ చేసి ఓవర్సీస్ హక్కులను కొనుగోలు చేస్తారా? చూద్దాం...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.