close
Choose your channels

నాని 28వ సినిమా... వెలువడిన ప్రకటన

Friday, November 13, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాని 28వ సినిమా... వెలువడిన ప్రకటన

నేచురల్‌ స్టార్‌ నాని వరుస సినిమాలకు ఓకే చెబుతూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం నాని తన 26వ చిత్రం 'టక్‌ జగదీష్‌' సెట్స్‌పైనే ఉంది. ఈ సినిమా ముగియగానే రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమా షూటింగ్‌లో నాని పాల్గొనబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కాకముందే నాని తన 28వ సినిమాను అధికారికంగా ప్రకటించారు. మెంటల్‌ మదిలో, బ్రోచెవారెవరురా వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వివేక్‌ ఆత్రేయ ఈ సినిమాను డైరెక్ట్‌ చేయబోతున్నాడు. కాగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించనుంది.

మరో ఆసక్తికరమైన విషయమేమంటే మలయాళీ హీరోయిన్ నజ్రీయా ఫహాద్‌ ఇందులో హీరోయిన్‌గా నటింనుంది. కర్టెన్‌ రైజర్‌తో నవంబర్‌ 21న కలుద్దాం.. అంత వరకు దీపావళి శుభాకాంక్షలు అంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నానితో చేయబోయే సినిమా గురించిన వివరాలను ప్రకటించింది. నాని కమిట్‌మెంట చూస్తుంటే ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే స్టార్ట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెన్సిబుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే వివేక్‌ ఆత్రేయ నానిని ఎలా ప్రెజంట్ చేస్తారో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.