close
Choose your channels

'సైరా'లో నాజ‌ర్ పాత్ర ఏంటంటే..

Friday, March 16, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సైరాలో నాజ‌ర్ పాత్ర ఏంటంటే..

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర‌తో తెర‌కెక్కుతున్న చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీకి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్ సేతుప‌తి, సుదీప్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వీరితో పాటు విల‌క్ష‌ణ న‌టుడు నాజ‌ర్ కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 

ఇందులో ఆయ‌న చిరుకి గాడ్ ఫాద‌ర్ లాంటి పాత్ర చేస్తున్నార‌ని స‌మాచారం. న‌ర‌సింహారెడ్డి పెళ్ళి విష‌యంలో ఆయ‌నే నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని.. దగ్గ‌రుండి ఆ పెళ్ళి జ‌రిపిస్తాడ‌ని తెలిసింది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది. రెండు నెల‌ల క్రిత‌మే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటోంది. వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.