సెన్సేషనల్ డైరెక్టర్‌కి నయనతార గ్రీన్ సిగ్నల్..!
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
నయనతారతో సినిమా అంటే బిజినెస్ పరంగా నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ ఏడాది ఓటీటీలో అమ్మోరు తల్లి సినిమాతో అభిమానులను ఆకట్టుకున్న నయనతార ఇప్పుడు తన బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ‘కాతువాక్కుల్ రెండు కాదల్’ సినిమాలో నటిస్తుంది. ఇది కాకుండా, రీసెంట్గా ఓ సెన్సేషనల్ డైరెక్టర్‌తో కలిసి పనిచేయడానికి నయనతార ఓకే చెప్పిందట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. ‘ప్రేమమ్’ సినిమాను తెరకెక్కించిన ఆల్ఫెన్స్ పుత్రెన్. ఈయన డైరెక్ట్ చేసిన ‘ప్రేమమ్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే.
మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రీమేక్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. మరో భాషకు సంబంధించిన డైరెక్టర్స్, మేకర్స్ దీన్ని టచ్ చేయాలన్నా ఆలోచనలో పడ్డారు. అంత ఎఫెక్ట్ క్రియేట్ చేసిన సినిమా అది. దాదాపు ఐదేళ్ల తర్వాతనే అల్ఫెన్సో డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. ‘పాట్టు’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్‌తో నయనతార జోడీ కడుతుంది. మ్యూజిక్ పరంగా అవగాహన ఉన్న ఈ డైరెక్టర్ అల్ఫెన్స్ ఈ సినిమా కోసం మరింత శిక్షణ తీసుకున్నాడట. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.