close
Choose your channels

మరోసారి ఆ దర్శకుడితోనే నయన...

Friday, September 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు, త‌మిళంలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న న‌య‌న‌తార, ద‌ర్శ‌కుడు గ‌ణేష్ శివ‌న్‌తో ప్రేమ‌లో మునిగి తేలుతుంది. గ‌తేడాది వీరి కాంబినేష‌న్‌లో విడుద‌లైన నానుం రౌడీ తాన్‌(నేను రౌడీనే) చిత్రం మంచి విజ‌యాన్ని అందుకోవ‌డ‌మే కాకుండా న‌య‌న‌తార‌కు సైమా అవార్డుని తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఈ డైరెక్ట‌ర్ సూర్య హీరోగా ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించ‌నున్నాడు. కాగా తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుందని కోలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే ఇందులో కొత్తేమీ లేద‌ని, కొంద‌రు వాదిస్తున్నారు. న‌య‌న‌తార‌కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంద‌ని అందుకే సూర్య కూడా న‌య‌న‌తో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ని అంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.