close
Choose your channels

విభిన్న ప్రేమకథా చిత్రం నీజతలేక - హీరో నాగశౌర్య

Thursday, July 28, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగశౌర్య, పారుల్‌, సరయు హీరో హీరోయిన్లుగా లారెన్స్ దాస‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం నీజ‌త‌లేక‌. ఈ చిత్రాన్ని శ్రీ సత్య విదుర మూవీస్‌ బ్యానర్‌పై జి.వి.చౌద‌రి, నాగ‌రాజ్ గౌడ్ సంయుక్తంగా నిర్మించారు. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన నీజ‌త‌లేక చిత్రాన్ని ఆగ‌ష్టు 13న రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో..
హీరో నాగ‌శౌర్య మాట్లాడుతూ....కెరీర్ స్టార్టింగ్ లో చేసిన సినిమా ఇది. ఈ సినిమా క‌థ గురించి చెప్పాలంటే....ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు అమ్మాయిని విడిచి అబ్బాయి ఉండ‌లేడు...అలాగే అబ్బాయిని విడిచి అమ్మాయి ఉండ‌లేదు. అలా ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేని ప్రేమికులు ప్రేమా..? కెరీరా..? రెండింటిలో ఏదో ఒక‌టి ఎంచుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు వాళ్ల ప‌రిస్థితి ఏమిటి అనే క‌థాంశంతో ఈ చిత్రం రూపొందింది.
ఈ చిత్రంలో నేను మోడ‌ల్ గా న‌టించాను. డైరెక్ట‌ర్ లారెన్స్ దాస‌రి అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా ఈ చిత్రాన్ని బాగా తీసాడు. సినిమా బిగినింగ్..ఇంట‌ర్వెల్ సీన్ ఈ చిత్రానికి ప్ర‌త్యేకార్ష‌ణ‌గా నిలుస్తాయి. హైద‌రాబాద్, బ్యాంకాక్, వైజాగ్ లో షూటింగ్ చేసాం. స్వ‌రాజ్ మంచి ట్యూన్స్ అందించాడు. ఆడియో స‌క్సెస్ అయ్యింది. ఈ చిత్రాన్ని కూడా ఆద‌రించాల‌ని కోర‌కుంటున్నాను. నెక్ట్స్ సాయి కొర్ర‌పాటి బ్యాన‌ర్ లో ఓ సినిమా, సుకుమార్ బ్యాన‌ర్ లో ఓ సినిమా చేస్తున్నాను అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.