close
Choose your channels

నిఖిల్ అర్జున్ సురవరం పోస్టర్ విడుదల

Thursday, February 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నిఖిల్ అర్జున్ సురవరం పోస్టర్ విడుదల.. 

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం అర్జున్ సురవరం. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్ర కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసారు చిత్ర‌యూనిట్. ఈ మ‌ధ్యే విడుద‌లైన టైటిల్ పోస్ట‌ర్ కు కూడా అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది అర్జున్ సురవరం. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్.

ఇందులో జర్నలిస్ట్ గా నటిస్తున్నారు నిఖిల్. టిఎన్ సంతోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర ఈ చిత్రంలో స‌హాయ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్పి బ్యాన‌ర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు. బి మ‌ధు అర్జున్ సురవరం చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.