close
Choose your channels

దొడ్డ మ‌న‌సు చాటుకున్న నిఖిల్‌

Wednesday, June 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దొడ్డ మ‌న‌సు చాటుకున్న నిఖిల్‌

యువ హీరో నిఖిల్ త‌న పెద్ద మ‌న‌సుని చాటుకున్నాడు. ప్ర‌కృతి వైప‌రీత్యాలు వ‌చ్చిన‌ప్పుడు త‌న శ‌క్తిమేర స‌హకారం అందించే హీరో నిఖిల్ . మ‌రోసారి త‌న దొడ్డ మ‌న‌సుని చాటుకున్నారు. ఇటీవ‌ల ఆయ‌న భీమ‌వ‌రంలోని ఓ పాఠ‌శాల‌ను సంద‌ర్శించారు.

అక్క‌డ పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డిపిన నిఖిల్ ఆ ఫోటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డమే కాకుండా.. ఆ స్కూల్‌లోని 300 మంది పిల్ల‌లు స్టార్టింగ్ నుండి ముగిసే వ‌ర‌కు చ‌దువు ఖ‌ర్చునంతా తానే భ‌రిస్తానంటూ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. తాను భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని మంచి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తాన‌ని తెలిపారు.

ప్రస్తుతం `అర్జున్ సుర‌వ‌రం` సినిమా విడుద‌ల కోసం నిఖిల్ ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు. మంచి విడుద‌ల తేదీ, థియేట‌ర్స్‌కోసం నిఖిల్ నిరీక్షిస్తున్నాడు. మ‌రి ఈయ‌న నిరీక్ష‌ణ ఎప్పుడు ఫ‌లించ‌నుందో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.