close
Choose your channels

వేస‌విలో నిత్యా మీన‌న్ 'ప్రాణ'

Tuesday, March 20, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వేస‌విలో నిత్యా మీన‌న్ ప్రాణ 

కేర‌ళ‌కుట్టి నిత్యా మీన‌న్‌.. ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టించిన‌ సంగ‌తి తెలిసిందే. 'ప్రాణ' పేరుతో దర్శకుడు వి.కె.ప్రకాష్ రూపొందించిన ఈ సినిమా  తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాష‌ల్లో తెరకెక్కింది. హిల్ స్టేషన్ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ మూవీలో రచయిత్రిగా క‌నిపించ‌నున్నారు నిత్య.

ఒకే ఒక పాత్ర‌తో సాగే ఈ ప్ర‌యోగాత్మ‌క చిత్రానికి.. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. “గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ జాజ్” లూయిస్ బ్యాంక్స్ సంగీతం అందిస్తున్నారు.  పి.సి.శ్రీ‌రామ్ ఛాయాగ్ర‌హ‌ణం అందించిన ఈ మూవీ కేవ‌లం 23 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ సినిమాని వేస‌వి కానుక‌గా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.  సింక్ సౌండ్ ప‌ధ్ధ‌తిలో రూపొందిన మొట్ట‌మొద‌టి ఇండియ‌న్ సినిమా ఇది. 'అ!'లో లెస్బియ‌న్‌గా అల‌రించిన నిత్యా.. ఈ సారి ర‌చ‌యిత్రిగానూ ఆక‌ట్టుకుంటుందేమో చూడాలి. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.