close
Choose your channels

అప్పుడు ఎస్.వి.కృష్ణారెడ్డి.. ఇప్పుడు మారుతియా?

Saturday, August 13, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ చిత్రాలు తీయ‌డంలో పెట్టింది పేరుగా వ‌రుస విజ‌యాలు అందుకున్న ద‌ర్శ‌కుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి. ఆయ‌న ద‌ర్శ‌క్వంలో వ‌చ్చిన మాయ‌లోడు, రాజేంద్రుడు-గ‌జేంద్రుడు, య‌మ‌లీల‌, ఘ‌టోత్క‌చుడు, శుభ‌ల‌గ్నం, ప్రేమ‌కు వేళాయెరా, ఎగిరే పావుర‌మా..ఇలా ఒక‌టేమిటి ఏ సినిమా చేసిన సూప‌ర్ హిట్టే అనే రీతిలో ఏక‌బిగిన విజ‌యాల‌ను అందుకున్నాడు. దాంతో స్టార్ హీరోలు కూడా ఆయ‌న సినిమాల్లో చేయాల‌ని ఉత్సాహం చూపించారు. అందులో భాగంగా అక్కినేని నాగార్జున, ఎస్‌.వి.కృష్ణారెడ్డితో వ‌జ్రం సినిమా చేయ‌గా, బాల‌కృష్ణ టాప్ హీరో అనే సినిమాల‌ను చేశాడు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాప‌డ్డాయి. దీంతో కృష్ణారెడ్డి ఓ మోస్తారు హీరోల‌తోనే సూప‌ర్‌హిట్ సినిమాలు చేయ‌గ‌ల‌డు. స్టార్ ఇమేజ్ ఉన్న చిత్రాల‌ను హ్యాండిల్ చేయ‌లేడ‌ని అనుకున్నారు. త‌ర్వాత స్టార్ హీరోలు కృష్ణారెడ్డితో సినిమాలు తీసే సాహసం చేయ‌లేదు.

ఈత‌రంలో మారుతి ప‌రిస్థితి అలానే త‌యారైంది. ఈరోజుల్లో అనే చిన్న‌సినిమాతో స్టార్ట‌యిన మారుతి ఆ సినిమా స‌క్సెస్ త‌ర్వాత వ‌చ్చిన బ‌స్‌స్టాప్‌, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ సినిమాలు సూప‌ర్‌హిట్ కావ‌డంతో మంచి డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే తొలిసారి మారుతి స్టార్ హీరో వెంక‌టేష్ సినిమా చేసే అవ‌కాశాన్ని క‌ల్పించాడు. వీరి కాంబినేష‌న్ లో రూపొందిన బాబు బంగారం సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా వెంక‌టేష్ కు ఉన్న స్టార్ ఇమేజ్‌ను మారుతి సినిమాలో హ్యాండిల్ చేయ‌లేక‌పోయాడ‌ని కొంద‌రు అనుకుంటున్నారు. అంతే కాకుండా మారుతి లో రేంజ్‌, మోస్తారు హీరోల‌ను మాత్ర‌మే హ్యాండిల్ చేయ‌గ‌ల‌డ‌ని, స్టార్ హీరోల సినిమాలు చేయ‌లేడ‌ని ఈ సినిమా ప్రూవ్ చేసింద‌ని అనుకుంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.