close
Choose your channels

అన్న‌య్యే కాదు.. అంత కంటే ఎక్కువ: తార‌క్‌

Sunday, July 5, 2020 • తెలుగు Comments

అన్న‌య్యే కాదు.. అంత కంటే ఎక్కువ: తార‌క్‌

‘‘నాకు అన్నయ్యగానే కాదు అంత కంటే ఎక్కువ‌. నా స్నేహితుడు, త‌త్వ‌వేత్త‌, మార్గ‌ద‌ర్శ‌కుడు. నువ్వు నిజంగా బెస్ట్‌.. హ్య‌పీ బ‌ర్త్ డే క‌ల్యాణ్ అన్న’’ అని అంటున్నారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. ఆదివారం (జూలై 5) క‌ల్యాణ్‌రామ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా తార‌క్ క‌ల్యాణ్‌రామ్‌కు ట్విట్ట‌ర్ ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు, నంద‌మూరి అభిమానులు, నిర్మాత‌లు క‌ల్యాణ్‌రామ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు.

నంద‌మూరి న‌ట వార‌సుల్లో మూడో త‌రం నటవారసుల్లో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ ఒక‌రు. హీరోగానే కాదు.. నిర్మాత‌గానూ ఆయ‌న రాణిస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. ‘బాల‌గోపాలుడు’ సినిమాతో బాల‌న‌టుడిగా న‌టించి మెప్పించారు క‌ల్యాణ్‌రామ్‌. హీరోగా ‘తొలిచూపులోనే’ చిత్రంతో ప‌రిచ‌యం అయ్యారు. అత‌నొక్క‌డే సినిమాతో హీరోగానే కాకుండా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి నిర్మాత కూడా అయ్యారు. ఈ బ్యాన‌ర్‌లో త‌ను హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా ర‌వితేజ‌తో ‘కిక్‌2’, సోద‌రుడు ఎన్టీఆర్‌తో ‘జైల‌వ‌కుశ’ సినిమాలను నిర్మించారు. తాజాగా ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న‌ సినిమా నిర్మాణంలోనూ క‌ల్యాణ్‌రామ్ భాగ‌మ‌య్యారు. ప్రస్తుతం మల్లిడివేణు దర్శకత్వంలో హీరోగా సినిమా చేస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz