close
Choose your channels

హాలీవుడ్ ద‌ర్శ‌కుడితో యంగ్ టైగ‌ర్‌..?

Tuesday, February 23, 2021 • తెలుగు Comments

హాలీవుడ్ ద‌ర్శ‌కుడితో యంగ్ టైగ‌ర్‌..?

కొన్ని వార్త‌లు నిజ‌మైతే బాగుంటుంది.. అని హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనుకుంటారు. ఇప్పుడు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అలాగే అనుకుంటున్నార‌ట‌. ఎందుకంటే.. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాకు సంబంధించిన వార్తొక‌టి నెట్టింట ఆ రేంజ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది మ‌రి. ఇంత‌కీ అంత పెద్ద న్యూస్ ఏంట‌ని అనుకుంటున్నారా? ఎన్టీఆర్... హాలీవుడ్‌లో అన్‌బ్రేకబుల్, స్ప్టిట్, ది సిక్స్త్ సెన్స్, గ్లాస్ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు మనోజ్‌ నైట్‌ శ్యామలన్‌‌తో సినిమా చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నాడ‌ట‌.

ప్ర‌స్తుతం ‘ఆర్ఆర్ఆర్(రణం రౌద్రం రుధిరం)’ సినిమాను పూర్తి చేయ‌డంలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త‌దుప‌రి త్రివిక్ర‌మ్ ఆల్‌రెడీ లైన్‌లో పెట్టేశాడు. మ‌రో వైపు ఎన్టీఆర్‌.. ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా, త‌మిళ ద‌ర్శ‌కులు అట్లీ, లోకేష్ క‌న‌క‌రాజ్‌లతోనూ సినిమాలు చేస్తాడ‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో మన దర్శకులు అందరినీ హోల్డ్‌లో పెట్టి హాలీవుడ్ ద‌ర్శ‌కుడితో యంగ్ టైగ‌ర్ సినిమా ఎలా చేస్తాడు? అనేది పెద్ద సందేహం. అయితే అభిమానులు మాత్రం ఎన్టీఆర్..హాలీవుడ్ మూవీ చేస్తే బావుంటుంద‌ని అనుకుంటున్నార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz