close
Choose your channels

ముస్తాబవుతున్న ఓయ్..నిన్నే.

Tuesday, July 4, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సోలో నువ్వా-నేనా, రా రా కృష్ణయ్య చిత్రాలను నిర్మించిన వంశీకృష్ణ శ్రీనివాస్ తాజాగా నూతన హీరో, హీరోయిన్‌ను పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ఓయ్..నిన్నే. భరత్ మార్గాని, సృష్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా పరశురామ్, చందు మొండేటి, సుధీర్ వర్మ, కృష్ణచైతన్య వద్ద దర్శకత్వ శాఖలో పలు చిత్రాలకు పనిచేసిన సత్యం చల్లకోటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ గ్రామీణ నేపథ్యంలో నడిచే అందమైన కుటుంబ కథా చిత్రమిది. ఫ్యామిలీ ఎమోషన్స్ విత్ క్యూట్‌లవ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో అన్ని వర్గాలకు వారికి నచ్చే అంశాలున్నాయి. ఈ నెల రెండోవారంలో ఆడియోను విడుదల చేసి, చివరివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. భరత్, సృష్టి, తనికెళ్ళభరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, తాగుబోతు రమేష్, తులసి, ప్రగతి, ధన్‌రాజ్ తదితరులు నటస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: శేఖర్‌చంద్ర, పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఎడిటింగ్: మార్తండ్.కె.వెంకటేష్, ఫైట్స్: వెంకట్, నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్, దర్శకత్వం: సత్యం చల్లకోటి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.