close
Choose your channels

భారత్‌కు పోటీగా మిస్సైల్ టెస్ట్.. పరువు పొగొట్టుకున్న పాక్, ఏం జరిగిందంటే..?

Friday, March 18, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భారత్‌పై వీలు కుదిరినప్పుడల్లా అక్కసు వెళ్లగక్కే దాయాది దేశం పాకిస్తాన్ పరువు పొగొట్టుకుంటూనే వుంది. జాతీయ , అంతర్జాతీయ వేదికలపై ఇలా ఎన్నోసార్లు అభాసుపాలైంది పాక్. తాజాగా మరోసారి దాయాది నవ్వుల పాలైంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల భారత్ ప్రయోగించిన ఓ మిస్సైల్ పొరపాటున పాకిస్తాన్ సరిహద్దును దాటి జనావాసాల్లో పడింది. ఆస్తి నష్టం సంభవించినప్పటికీ అద‌ృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోలేదు. ఈ ఘటనను పాక్ తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై దర్యాప్తు నిర్వహించి తమకు నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది.

అయితే ఈ ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ తన సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు తాజాగా ఓ క్షిపణి ప్రయోగం చేపట్టగా.. అది కాస్తా విఫలమవ్వడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశం పరువు పోయింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లోని జంషోరో ప్రాంతంలో గురువారం ఓ గుర్తుతెలియని వస్తువు గాల్లోకి ఎగిరి.. కింద పడటాన్ని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. అయితే ఆ వస్తువు క్షిపణి అని తర్వాత గుర్తించారు. సింధ్‌లోని టెస్ట్‌ రేంజ్‌ నుంచి ఓ క్షిపణి ప్రయోగం చేపట్టింది. అయితే ట్రాన్స్‌పోర్టర్‌ ఎరెక్టర్‌ లాంఛర్‌లో సమస్య కారణంగా ఈ ప్రయోగాన్ని గంటపాటు వాయిదా వేసినట్లు పాకిస్తాన్ మీడియా కథనాలను ప్రసారం చేశాయి. ఆ తర్వాత 12 గంటల ప్రాంతంలో క్షిపణి గాల్లోకి లేవగా... కొద్ది సెకన్లకే ఆ మిస్సైల్ తన లక్షిత మార్గం నుంచి గురి తప్పి కుప్పకూలింది.

పాక్‌లోని కొన్ని మీడియా ఛానల్స్‌ ఈ ఘటనపై కథనాలను ప్రసారం చేయగా.. ఇప్పటివరకు అధికారులు మాత్రం దీనిపై స్పందించలేదు. అయితే అది క్షిపణి కాదని, సాధారణ మోర్టార్‌ ట్రేసర్‌ రౌండ్‌ అని కొందరు అంటున్నారు. ఇటీవల చోటుచేసుకున్న భారత క్షిపణి ఘటనకు ప్రతిస్పందనగానే పాక్‌ ఈ ప్రయోగం చేపట్టి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.