close
Choose your channels

Bigg Boss 7 Telugu : హౌస్‌ తొలి కెప్టెన్‌గా పల్లవి ప్రశాంత్.. శివాజీ నమ్మకాన్ని నిలబెట్టిన రైతుబిడ్డ

Saturday, October 7, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న లెటర్ కోసం త్యాగం చేసే టాస్క్‌లో ఇంటి సభ్యులు వాళ్లు ఏడవటంతో పాటు ప్రేక్షకుల్ని కూడా ఏడిపించారు. గౌతమ్ కోసం శుభశ్రీ త్యాగం చేయగా.. తేజ కోసం ప్రిన్స్ యావర్ త్యాగమూర్తిగా మారాడు. ఇవాళ అమర్‌దీప్, సందీప్‌ల వంతు వచ్చింది. తన తల్లి ఆరోగ్యం ఎలా వుందో తెలుసుకోవాలని వుందని సందీప్ అడగటంతో అమర్‌దీప్ తన భార్య తేజస్వీ నుంచి వచ్చిన లేఖని చదవకుండా త్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. దీంతో ఇద్దరూ కన్నీటి పర్యంతమై ప్రేక్షకుల గుండెని బరువెక్కించారు.

తర్వాత శివాజీ, పల్లవి ప్రశాంత్‌ల వంతు వచ్చింది. ఏమాత్రం బాధపడకుండా రిలాక్డ్స్‌డ్‌గా భార్య పంపిన కాఫీ తాగాడు శివాజీ. ప్రశాంత్ కోసం తన భార్య పంపిన లెటర్‌ను త్యాగం చేశాడు. నువ్వు హౌస్‌లో వుండాలని.. ఒక రైతుబిడ్డ ఈ స్థాయికి వచ్చాడని గొప్పగా మాట్లాడుకోవాలని , నువ్వు కెప్టెన్ కావాలంటూ ప్రశాంత్‌ని మోటివేట్ చేసేలా మాట్లాడాడు. శివాజీ త్యాగానికి , తన మీద పెట్టుకున్న నమ్మకానికి ప్రశాంత్ కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం తన కుటుంబం పంపిన ఉత్తరం చదివి హ్యాపీగా ఫీలయ్యాడు ప్రశాంత్.

ఉత్తరాల టాస్క్ ముగిసిన తర్వాత పల్లవి ప్రశాంత్, సందీప్, టేస్టీ తేజా, గౌతమ్‌లు కెప్టెన్సీ కంటెండర్స్‌గా నిలిచారు. ఈ సందర్భంగా వీరికి ‘‘రంగు పడుద్ది రాజా’’ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా మీ టీ షర్ట్‌పై రంగు పడకుండా చూసుకోవాల్సి వుంటుంది. ఎండ్ బజర్ మోగేసరికి ఎవరి టీ షర్ట్‌పై తక్కువ పెయింట్ వుంటుందో వారే కెప్టెన్. ఈ టాస్క్‌కి ప్రియాంక సంచాలకురాలిగా వ్యవహరిస్తోంది.

టాస్క్ ప్రారంభం కాగాను.. సందీప్, పల్లవి ప్రశాంత్‌లు.. టేస్టీ తేజాను టార్గెట్ చేశారు. వీరిద్దరి ధాటికి తేజ త్వరగానే ఔట్ అయిపోయాడు. తర్వాత ప్రశాంత్, సందీప్ మధ్య పోటీ నడిచింది. సందీప్ టీషర్ట్ లాగి మరీ.. రంగు పూసేందుకు ట్రై చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే ప్రశాంత్‌ను సర్కిల్ నుంచి బయటికి లాగడానికి ప్రయత్నించడంతో.. సందీప్‌ను రేసు నుంచి తప్పుకోవాల్సిందిగా ప్రియాంక స్పష్టం చేసింది. దీనికి సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నన్ను కొడితే నేను వాడి తాటిస్తా , నన్ను తోసినప్పుడు నేను తోయనా అంటూ వాదించాడు. చివరికి కంటెస్టెంట్స్ అంతా ప్రశాంత్ వైపు నిలబడటంతో సందీప్ తప్పుకోక తప్పలేదు. చివరికి రేసులో ప్రశాంత్, గౌతమ్ నిలిచారు. ప్రశాంత్‌కు రంగు పూసేందుకు గౌతమ్ చాలా ట్రై చేశాడు. కానీ ప్రశాంత్ కూడా ఏమాత్రం తగ్గకుండా గౌతమ్‌కి కలర్ అంటించాడు. చివరిగా కొద్దిపాటి కలర్‌తో ప్రశాంత్‌ను విన్నర్‌గా ప్రకటించింది ప్రియాంక.

తద్వారా బిగ్‌బాస్ 7 సీజన్‌లో తొలి కెప్టెన్‌గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఇప్పటికే ఇతని వద్ద పవర్ అస్త్రా వుంది. దీనితో పాటు ఇప్పుడు కెప్టెన్ కూడా కావడంతో రెండు రకాల ఇమ్యూనిటీలతో ప్రశాంత్ మరికొద్దిరోజుల పాటు హౌస్‌లో సేఫ్‌గా వుండొచ్చు. అతను ఇలాగే కంటిన్యూ చేస్తే ఫైనల్‌కు వెళ్లడం పెద్ద కష్టం కాదని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.