close
Choose your channels

నాగబాబులోని రెండో కోణాన్ని బయటపెట్టిన పవన్!

Sunday, December 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగబాబులోని రెండో కోణాన్ని బయటపెట్టిన పవన్!

మెగాస్టార్ నాగబాబు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు హీరోతో పాటు పలు పత్రాల్లో నటించి మెప్పించిన ఈయన.. ఇప్పుడు మాత్రం పెద్దగా అవకాశాలు రావట్లేదు. అంతేకాదు.. జబర్దస్త్ కామెడీ షోతో సరిపెట్టుకున్నారు. అది కూడా వదిలేసి మరో షోను చూసుకున్నాడు. అయితే నాగబాబుకు ఒక్క నటనే కాదు.. ఇంకా చాలా చాలా వచ్చు అంటూ ఆయనలోని రెండో కోణాన్ని పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ బయటపెట్టాడు. ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాలు, రాజకీయాలతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

అన్నీ ఆయనే పరిచయం చేశాడు!

నాగబాబు అపూర్వమైన ప్రతిభ గల వ్యక్తని.. అంతేకాదు బహుముఖ ప్రజ్ఞ అని కూడా పవన్ చెప్పుకొచ్చాడు. ఎవరికీ తెలియని ఆసక్తికర విషయమేమిటంటే.. ఆయన మంచి చిత్రకారుడని వేణువు, యోగాభ్యాసం ఇలా చాలా విషయాల్లో మంచి పట్టున్న వ్యక్తని తెలిపాడు. అంతేకాదు.. జ్ఞాన, ధ్యాన, యోగ మార్గాలు కూడా అనుసరిస్తాడని చెప్పాడు. న్యాయనిపుణుడు ఫాల్కీవాలా రచనలు, వీరసావర్కర్‌, భగత్‌ సింగ్‌ను ఇలా పలు విషయాలను అన్నయ్య నాగబాబు తనకు పరిచయం చేశాడని పవన్ తెలిపాడు. కూడా!. అంతేకాదండోయ్... నాగబాబులో ఓ మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడట. సినిమాలో చూపించినట్టుగా కళ్ళకు కట్టినట్టు కథ చెప్పేస్తాడని జనసేనాని చెబుతున్నాడు. మొత్తానికి చూస్తే నాగబాబులోని రెండో కోణాన్ని బయటపెట్టడంతో.. ఈ ఆసక్తికర విషయాలను తెలుసుకున్న మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు ‘మన మెగా బ్రదర్ కూడా మంచి కళా పోషకుడే’ అని చెప్పుకుంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos